గూగుల్ తలపట్టుకుంది : రూ.34వేల కోట్ల జరిమానా పడింది

గూగుల్ కి భారీ షాక్ ఇచ్చింది యూరోపియన్ యూనియన్. గూగుల్ కంపెనీకి 4.34 బిలియన్ యుూరోపియన్ డాలర్ల ఫైన్ విధించింది. మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో తమ మార్కెట్ ను ఎదగనీయకుండా చేస్తుందని యూరోపియన్ కమిషన్ తెలిపింది.

అమెరికాకు చెందిన గూగుల్ సంస్ధ.. స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ముందుగానే గూగుల్స్ సెర్చ్, బ్రౌజర్ యాప్ డివైస్ లను తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో తప్పనిసరిగా ఉంచాలని, లేకపోతే తాము గూగుల్ ప్లే ఆన్ లైన్ స్టోర్, స్ట్రీమింగ్ సర్వీస్ ను అనుమతించమని చెప్పడాన్ని తప్పబట్టింది యూరోపియన్ కమిషన్. గూగుల్ అనైతిక చర్యలకు పాల్పడుతుందని అందుకే ఫైన్ విధించినట్లు బుధవారం(జులై-18) తెలిపింది. ఆండ్రాయిడ్ ఉపయోగించే విధానంలో గూగుల్ 3రకాలైన అనైతిక చర్యలకు పాల్పడినట్లు తెలిపింది. కొత్త ఆవిష్కరణలను కూడా గూగుల్ అడ్డుకుంటుందని, యూరోపియన్ యాంటి ట్రస్ట్ రూల్స్ ప్రకారం ఇది చట్టవిరుద్దం అని  తెలిపింది. తన షాపింగ్‌ సర్వీసులకు అనుకూలంగా యాంటీ ట్రస్ట్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో 2017లో కూడా 2.8 బిలియన్ డాలర్ల ఫైన్ గూగుల్ పై విధించింది యూరోపియన్ కమిషన్.

Posted in Uncategorized

Latest Updates