గూగుల్ లో ఈ ఏడాది ఎక్కువ సెర్చ్ చేసింది దేని గురించో తెలుసా

ప్రపంచవ్యాప్తంగా మనకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే మైండ్ లోకి వచ్చేది గూగులే. గూగుల్ లో సెర్చ్ చేయగానే సెకన్ల వ్యవధిలో ఇన్ఫర్మేషన్ మన ముందుంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఎక్కువ మంది.. సమాచారం కోసం గూగుల్ సెర్చ్ ఇంజనే ఉపయోగిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న గూగుల్ సెర్చ్ ఇంజన్ కు సంబంధించి రీసెంట్ గా ఓ వీడియోను గూగుల్ రిలీజ్ చేసింది.

2018లో గూగుల్ లో ఎక్కువ మంది యూజర్లు దేని గురించి ఎక్కువ సెర్చ్ చేశారని రిలీజైన ఈ వీడియోలో.. ‘గుడ్’ అనే పదం గురించి అత్యధిక మంది వెతికారని  తెలిపింది. గుడ్ ఫుడ్, గుడ్ థింగ్స్ ఇన్ ది వరల్డ్, హవ్ టు బి ఏ గుడ్ సిటిజన్, గుడ్ సింగర్, గుడ్ ఫ్రెండ్, వాట్ మేక్స్ ఏ గుడ్ ఫ్రెండ్, ఏ గుడ్ రోల్ మోడల్. వాట్ మేక్స్ ఏ గుడ్ టీచర్,హౌ టు బి ఏ గుడ్ డ్యాన్సర్.. ఇలా మంచికి సంబంధించిన పదాన్నే ఎక్కువగా సెర్చ్ చేయడం విశేషం. ఇయర్ ఇన్ సెర్చ్ పేరుతో రిలీజైన ఈ వీడియోను గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Posted in Uncategorized

Latest Updates