గూఢచారి మూవీ : యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్

Goodachari telugu movieశశికిరణ్ డైరెక్షన్ లో అడవి శేష్ హీరోగా నటించిన సినిమా గూఢచారి. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ను బుధవారం (జూలై-4)న ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది యూనిట్. 42 సెకన్లున్న ఈ టీజర్ లో యాక్షన్ సీన్స్, ఫైట్స్ లో అడవి శేష్ అదరగొట్టాడు. స్టైలిష్ గా కనిపించిన శేష్ సరసన 2013 మిస్ ఇండియా ఎర్త్ శోభిత దూళిపాళ్ల హీరోయిన్ గా నటించింది. ఇటీవల రిలీజైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ రాగా..లేటెస్ట్ గా రిలీజైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఆర్మీ కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ఇది.

చాలా కాలం తర్వాత నాగార్జున మేనకోడలు సుప్రియ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమా హీరోయిన్‌) ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న గూఢచారి ఆగస్ట్‌ 3న రిలీజ్‌  కానుంది.

Posted in Uncategorized

Latest Updates