గృహనిర్బంధం నుంచి గౌతమ్‌ కు విముక్తి

న్యూఢిల్లీ: పౌర హక్కుల నేత గౌతమ్ నవలఖా గృహనిర్బంధం నుంచి విముక్తి పొందారు. జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అయిన నవలఖాను .. పుణె పోలీసులు గృహనిర్బంధం చేశారు. బీమాకోరేగావ్ అల్లర్ల కేసులో దేశవ్యాప్తంగా ఐదుగురు పౌర హక్కుల నేతలను అరెస్టు చేశారు. అందులో గౌతమ్ కూడా ఉన్నారు. గృహనిర్బంధం నుంచి గౌతమ్‌ ను విముక్తి చేయాలంటూ .. ఇవాళ (అక్టోబర్-1)న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కింది కోర్టులో బెయిల్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చంటూ .. కొన్ని రోజుల క్రితం ఈ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది. ట్రాన్సిట్ రిమాండ్ ఆర్డర్‌ ను కూడా ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది. ఇదే కేసులో వరవరరావు, అరుణ్ ఫెరిరా, వెర్నన్ గొంజాల్వెస్, సుధా భరద్వాజ్‌ లు కూడా గృహనిర్బంధంలో ఉన్నారు.

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates