గెట్ వెల్ సూన్ : కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ

చెన్నై కావేరీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. కరుణానిధి చాలా గట్టిమనిషని రాహుల్ అన్నారు. కరుణ కోలుకుంటున్నాడని తెలిపారు. కరుణ కుంటుబానికి సోనియాగాంధీ బెస్ట్ విషెస్ తెలిపిందని రాహుల్ అన్నారు. ఇప్పటికే అనేక మంది సీనీ ప్రముఖులు, తమిళ సీఎం పళనిస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్, పలువురు రాజకీయ నాయకులు,  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,  శ్రీలంక మంత్రులు కూడా కరుణానిధిని పరామిర్శించారు. మరోవైపు కరుణ ఆరోగ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కావేరీ హాస్పిటల్ దగ్గరకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కరుణ అభిమానులు చేరుకున్నారు. కరుణ కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates