గెట్ వెల్ సూన్ : సీనియర్ నటి జయంతికి తీవ్ర అనారోగ్యం

jayanthiదక్షిణాది భాషాల్లోని అన్ని సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి జయంతి. 500 సినిమాల్లో నటించి ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి. ఇప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 26వ తేదీ సోమవారం రాత్రి అస్వస్థతలో ఉండటంతో మొదటి సిటీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడి వైద్యుల సూచన మేరకు విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ICUలో ఉన్నది. ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతుందని.. దీంతో వెంటిలేషన్ పై పెట్టినట్లు డాక్టర్లు తెలిపారు.  24 గంటల్లో సాధారణ స్థితికి వస్తుందని.. భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు.

జయంతి 1949 జనవరి 6వ తేదీన ఏపీ రాష్ట్రం శ్రీకాళహస్తిలో జన్మించారు. అక్కడి నుంచి చెన్నై వెళ్లి సినిమాల్లో నటించటం ప్రారంభించారు. చిన్నతనంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన జయంతి.. హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత అక్క, వదిన, తల్లి పాత్రల్లోనూ నటించారు. తెలుగులో వచ్చిన పెదరాయుడు సినిమాలో ఆమె నటన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటుంది.

 

Posted in Uncategorized

Latest Updates