గెలిచేది మేమే.. మమ్మల్నే పిలవండి : గవర్నర్ కు కూటమి వినతి

ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికి రాజ్యాంగబద్దత ఉందన్నారు కూటమి నేతలు. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డామని, ఫలితాల ప్రకటన తర్వాత గెలిచిన అభ్యర్థులకు భద్రత ఇవ్వాలన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపటి కౌంటింగ్ లో 80సీట్లు గెలిచి తీరుతామని… ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తామని స్పష్టం చేశారు.

రేపు కౌంటింగ్ జరగనుండటంతో గవర్నర్ తో ప్రజాకూటమి నేతల భేటీ ముగిసిన తర్వాత  ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీలు కలిసి కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం ఇచ్చామన్నారు. కూటమిలోని అన్ని పార్టీలకు వచ్చిన సీట్లు ఒక పార్టీకి వచ్చినట్లుగానే భావించాలన్నారు. కొన్ని పార్టీలు ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడేందుకు యత్నిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇవ్వాలని కోరారు. గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుమని, ప్రభుత్వం ఏర్పాటయ్యాకా కూడా కూటమి కొనసాగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి కూటమి నేతలు గవర్నన్‌కు వినతి పత్రం అందజేశారు. ఓట్ల గల్లంతుపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు ఉత్తమ్.

జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌పై తమకు పూర్తిగా నమ్మకముందన్నారు టీటీడిపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ. ప్రజలు మమ్మల్ని ఆదరించారని తెలుస్తోందన్నారు.

ప్రజాకూటమికి సంపూర్ణ మెజార్టీ వస్తుందన్నారు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం.  కూటమిని ఓ సమూహంగా చూడాలన్నారు. గతంలో సర్కారియా కమిషన్ ఇదే అంశం చెప్పిందని…ఆ వివరాలను గవర్నర్ కు ఇచ్చామన్నారు.

Posted in Uncategorized

Latest Updates