గెలిచే సీట్లు అడగకుండా…గెలవలేనివి అడిగింది : మాయా వ్యాఖ్యలపై కమల్ నాథ్

మధ్యప్రదేశ్, రాజస్ధాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ తో పొట్టు పెట్టుకోబోమని బుధవారం(అక్టోబర్-3) బీఎస్పీ చీఫ్ మాయావతి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ స్పందించారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తాము పోటీ చేయాలనుకొంటోన్న నియోజకవర్గాల లిస్ట్ ను ఇచ్చిందని, అయితే ఆ లిస్ట్ లో ఇచ్చిన నియోజకవర్గాలలో బీఎస్పీ గెలిచే పరిస్ధితులు ఏ మాత్రం లేవని కమల్ నాథ్ అన్నారు. బీఎస్పీ…. ఇచ్చిన లిస్ట్ లో గెలవగలిగే నియోజకవర్గాలను ఎంచుకోకుండా, గెలవలేని నియోజకవర్గాలను ఎంచుకొందని అన్నారు.
కాంగ్రెస్ తో పొత్తు నుంచి బీఎస్పీ తప్పుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో పొత్తు గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కమల్ నాథ్ అన్నారు.క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు.

Posted in Uncategorized

Latest Updates