గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తాం : రాహుల్ కు హామీ ఇచ్చిన రాష్ట్ర నేతలు

tc2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో ముందుకు వెళ్తామన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో ఇవాళ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు రాష్ట్ర  నేతలు. దాదాపు అరగంట సేపు అధినేతతో చర్చించారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాహుల్ ను కోరారు నేతలు. పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. త్వరలోనే మరోసారి ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని అధి నాయకున్ని కోరామన్నారు రాష్ట్ర నేతలు. అందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, డికె అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కార్తీకా రెడ్డి, తదితరులు నిన్న ఆయనకు ఢిల్లీలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధినేతతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించారు.

Posted in Uncategorized

Latest Updates