గెస్ట్ హౌజ్ సీజ్ పై హైకోర్టుకు వెళ్లిన ప్రభాస్


హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న తన గెస్ట్ హౌజ్ ను  సీజ్ చేయడం పై హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు నోటీసులు ఇవ్వకుండానే గెస్ట్ హౌజ్ ను సీజ్ చేశారంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం విచారించనుంది. రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబర్ 46 లో ఉన్న 84 ఎకరాలు స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దీంతో అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను నిన్న(మంగళవారం) జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. సినిమా హీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ కూడా అక్కడే ఉండటంతో.. దానిని సీజ్ చేశారు. కూల్చివేతల సమయంలో గెస్ట్ హౌజ్ దగ్గర ఎవరూ లేకపోవడంతో…. గేట్ కు సీజ్ నోటీసు అంటించారు అధికారులు. 2వేల 2వందల గజాల్లో ఈ గెస్ట్ హౌజ్ నిర్మాణం జరిగింది.

 

Posted in Uncategorized

Latest Updates