గేదెలను కూడా వదలని ఇమ్రాన్ ఖాన్

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ ను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కఠిన నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఇప్పటికే గ్యాస్ ధరలను 140 శాతం పెంచింది ఇమ్రాన్ ప్రభుత్వం. దేశంలో లోటు బడ్జెట్‌, ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ 61 విలాసవంతమైన కార్లను వేలం వేసి.. రూ.20 కోట్లు సంపాదించింది. మరో 102 కార్లను, నాలుగు హెలికాప్టర్లను అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ సమయంలో మాజీ ప్రధాని మంత్రి నవాజ్ షరీఫ్ ఎంతో ఇష్టంగా పెంచుకున్న గేదెలను కూడా ఇమ్రాన్ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. ప్రధాని నివాసంలోని ఎనిమిది గేదెలను గురువారం(సెప్టెంబర్-27) వేలం వేశారు. ఓ గేదె అత్యధికంగా 3 లక్షల 85 వేలకు అమ్ముడు పోయింది. గేదెలను వేలం వేయడం ద్వారా మొత్తం రూ.23 లక్షలు ప్రభుత్వ ఖజానాకు చేరింది.
అయితే పొదుపు మంత్రం పేరుతో వీటిని వేలానికి పెట్టి…. ఆ డబ్బును ఇమ్రాన్‌ ఖాన్‌ తన విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారంటూ విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates