గేల్ మెరుపు సెంచరీ.. హైద‌రాబాద్ టార్గెట్-194

Chris-Gayleమొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా కింగ్స్ లెవెన్ పంజాబ్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు 194 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది.

పంజాబ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ (104), విశ్వరూపం చూపించాడు. కేవలం 58  బంతుల్లో సెంచరీ సాధించడంతో పాటు మొత్తం 11 సిక్సులు, ఒక ఫోర్ తో 104 రన్స్ చేశాడు.  ఈ  సీజన్ IPL 2018 లో మొదటి సెంచరి చేశాడు గేల్. మిగతా ప్లేయర్లు నాయర్ 31, రాహుల్, అగర్వాల్ 18 చొప్పున పరుగులు చేశారు.

హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, కౌల్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates