గేల్ విజృంభణ..చెన్నై టార్గెట్-198

iplIPL సీజన్ లో భాగంగా ఆదివారం (ఏప్రిల్-15) మొహాలీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్..నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్, కరీబియన్ స్టార్ క్రిస్‌గేల్ విధ్వంసం సృష్టించాడు. సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న గేల్ కసితీరా వీరబాదుడు బాదేశాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు బంతి గాల్లోనే ఎక్కువసేపు ఉంది. ధోనీసేనపై తన మునుపటి ప్రతాపాన్ని చూపించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులను తన సిక్సర్లతో అలరించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం తనదైన స్టైల్ లో మరోసారి విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు చుక్కలు కనిపించాయి.

జట్టు స్కోరు 96 వద్ద రాహుల్ వెనుదిరిగినా.. వన్‌ డౌన్‌ లో వచ్చిన మయాంక్ అగర్వాల్‌తో కలిసి క్రిస్‌గేల్‌ (63; 33 బంతుల్లో 7×4, 4×6) స్కోరు బోర్డును ముందుండి నడిపించాడు. షేన్ వాట్సన్ వేసిన అనూహ్య బంతిని షాట్ ఆడగా.. బ్యాట్‌కు టాప్ ఎడ్జ్ అయిన బంతి ఫీల్డర్ ఇమ్రాన్ తాహిర్ చేతిలో పడింది. దీంతో యూనివర్స్‌ బాస్‌.. గేల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Posted in Uncategorized

Latest Updates