గేల్ స్టన్నింగ్ క్యాచ్ : ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఇదే రికార్డ్

సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ బ్యాట్‌ తో సృష్టించే విధ్వంసం మనకు తెలుసు. అయితే స్లిప్ ఫీల్డర్‌ గానూ గేల్ అద్భుతాలు చేయగలడు. క్రికెట్‌ లోని చాలా అరుదైన క్యాచుల్లో ఇదీ ఒకటని చెప్పొచ్చు. కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టీ20 టోర్నీలో గేల్ ఈ క్యాచ్ అందుకున్నాడు. ఈ టోర్నీలో వాంకూవర్ నైట్స్ తరఫున గేల్ ఆడుతున్నాడు. వెస్టిండీస్ బీ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గేల్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. కావెమ్ హాడ్జ్ కొట్టిన షాట్‌ ను డైవ్ చేసి అందుకున్నాడు. అయితే ముందు లెఫ్ట్‌ హ్యాండ్‌ తో ఆ క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అది వేళ్లకు తగిలి పైకి ఎగిరింది. దానిని మరోసారి తన రైట్‌ హ్యాండ్‌ తో అందుకొని గేల్ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాజిక్ క్యాచ్ చూసి సహచర ఫీల్డర్లు కూడా నోరెళ్లబెట్టారు. క్రికెట్ చరిత్రలో ఇది రికార్డ్ క్యాచ్ అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates