గొడవలు ఉంటే మాత్రం : పొలంలో ఇద్దరు రైతుల హత్య

Father-And-Son-Thrashed-To-Deathదారుణం అంటే ఇదే.. ఎన్ని గొడవలు ఉంటే మాత్రం ఇలా చేస్తారా.. ఇంతకు తెగిస్తారా.. పొలంలోనే ఇద్దరు రైతులను గొడ్డళ్లతో నరికి చంపారు ప్రత్యర్థులు. హత్యకు గురైన ఇద్దరు కూడా తండ్రీకొడుకులు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ హామ్లెట్ కిష్టరావుపల్లి గ్రామం. ఎల్లయ్య, శేఖర్ తండ్రీకొడుకులు. జూన్ 12వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో ఇద్దరూ తమ పొలానికి వెళ్లారు. విత్తనాలు నాటుతున్నారు. ఇదే సమయంలో.. ప్రత్యర్థులు మామిళ్ల దేవయ్య, ఆయన కుమారుడు స్వామి, మరో ఇద్దరు వచ్చి కళ్లల్లో కారం కొట్టి.. గొడ్డళ్లతో నరికి చంపారు.

సర్వే నెంబర్ 540లో ఉన్న భూమిలో 39 కుంటలపై వివాదం నడుస్తోంది. దీనిపై రెండు కేసులు కూడా నమోదు అయ్యారు. కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. ఈ రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు హత్యలకు దారి తీసింది. తండ్రీకొడుకుల అయిన ఎల్లయ్య, శేఖర్ లను చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ వేసుకున్నారు. ఉదయం పొలం దగ్గరకు విత్తనాలు వేసేందుకు వస్తారని ముందే తెలుసుకున్న మామిండ్ల దేవయ్య కుటుంబం గొడ్డళ్లతో వచ్చినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెల్లడించారు. నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఉండటంతో.. పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates