గోదాంలో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

fire
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలోని గగన్ పహాడ్ దగ్గర ఓ గోదాంలో అర్ధరాత్రి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గోదాంలో ప్లాస్టిక్ ఫైబర్ వస్తువులు ఎక్కువగా ఉండడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.45 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ షర్క్యుట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం.

Posted in Uncategorized

Latest Updates