గోదాముల సామర్థ్యం పెంచాం: హరీశ్

harishరాష్ట్రంలో ఏడాదిలో గోదాముల సామర్థ్యం పెంచామన్నారు మంత్రి హరీశ్‌రావు. రాష్ట్ర రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రూ.1000 కోట్లతో గోదాంలు నిర్మించామని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాంలు ఉండేవని ఇప్పడు వాటి సామర్థ్యం 18 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రతి మండల కేంద్రంలో ఒక గోదాం నిర్మించామన్నారు. కొన్ని చోట్ల పట్టణానికి మధ్యలో కొన్ని గోదాంలు ఉన్నాయని.. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం చూపిస్తే వాటి స్థానంలో మరింత విశాలంగా కొత్త వసతులతో లేటెస్ట్  టెక్నాలజీతో గోదాంలను నిర్మిస్తామని ప్రకటించారు మంత్రి హరీశ్ రావు.

Posted in Uncategorized

Latest Updates