గోదావరి పడవ ప్రమాదం : మహిళ డెడ్ బాడీ లభ్యం

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద శనివారం (జూలై-14) సాయంత్రం 40 మందితో గోదావరి దాటుతున్న పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఆదివారం (జూలై-15) ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఐ.పోలవరం మండలం కొమరగిరి వద్ద గల్లా నాగమణి మృతదేహాన్ని సహాయక సిబ్బంది గుర్తించారు. శేరిలంక, కమిని, సలాదివారిపాలెం, వలసలతిప్ప, సీతారాంపురం గ్రామాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ప్రియ, మనీషా, సుచిత్ర, అనూష, శ్రీజ, రమ్య, దుర్గ ఆచూకీ లభించాల్సి ఉంది. వివిధ పనుల కోసం మురమళ్ల వచ్చి తిరిగి ప్రయాణమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన మిగిలిన ఆరుగురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates