గోపిచంద్ పంతం టీజర్ విడుదల

pantham గత కొంత కాలం నుంచి స‌రైన స‌క్సెస్ సినిమా లేక ఇబ్బంది ప‌డుతున్న గోపిచంద్ ప్ర‌స్తుతం చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో పంతం చేస్తున్నాడు. ఇందులో మెహ‌రీన్ క‌థానాయికగా న‌టిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో గోపిచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. సీరియ‌స్ లుక్‌తో క‌నిపిస్తున్న గోపించంద్ పోలీస్ గెట‌ప్‌లో హడలెత్తిస్తున్నారు. పంతం అనే టైటిల్‌కి ఫ‌ర్ ఏ కాజ్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమాతో త‌ప్ప‌క స‌క్సెస్ సాధించాల‌నే క‌సితో నటించాడు గోపిచంద్. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కెకె రాధామోహన్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. సామాజిక అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. వ‌చ్చే నెల‌లో సినిమాని విడుద‌ల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates