గోపీచంద్..’పంతం’ సినిమా ట్రైలర్ రిలీజ్

Pantham-GOPIగోపీచంద్‌ కొత్త సినిమా పంతం. యాక్షన్‌ డ్రామాతో నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ సోమవారం(జూన్-25)న చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కే చక్రవర్తి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్లతోనే ట్రైలర్‌ను కట్‌ చేశారు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ మూవీలో గోపీచంద్‌ స్టైలిష్‌ అప్పీల్‌తో ఆకట్టుకునే యత్నం చేశాడు. ఓవైపు ఎంటర్‌టైన్‌మెంట్‌తో నేతల అవినీతిపై హీరో పోరాటం లాంటి సీరియస్‌ సబ్జెక్టును డైరెక్టర్‌ డీల్‌ చేశాడు. ‘వాడు కాజేస్తోంది నీ అన్నాన్ని, నీ భవిష్యత్తు..నీ బతుకుని రా… అనే డైలాగ్ తో కోర్టు సీన్‌ సన్నివేశాన్ని ట్రైలర్ లో హైలెట్‌ గా చూపించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. పంతం సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Posted in Uncategorized

Latest Updates