గోరక్ష అరాచకాలపై సుప్రీం ఆగ్రహం


గోసంరక్షణ పేరిట మోరల్ పోలీసింగ్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సమాజానికి మేలు చేస్తున్నామంటూ కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది కోర్టు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని ఆదేశించింది. గోసంరక్షకులు దేశవ్యాప్తంగా చాలాచోట్ల దాడులు చేయటంపై తెహసీన్ పూనెవలే అనే వ్యక్తి.. పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మోరల్ పోలీసింగ్ పై పార్లమెంట్ లో చట్టం చేసే ఆలోచన ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు పిటిషనర్ తెహసీన్ పూనెవల. త్వరలోనే దీనిపై అన్నిరాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates