గోల్కండ బోనాలు : ఘనంగా తొట్టెల ఊరేగింపు

తెలంగాణ సంప్రదాయాలకు నెలవైన బోనాల జాతర కోలాహలంగా ప్రారంభమైంది. ఆశాడమాసం ఆదివారంతో (జూలై-15) మొదలైన ఈ పండుగలో భాగంగా హైదరాబాద్‌ లో గోల్కొండ బోనాల కోలాహలంతో సందడి వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌ హౌజ్‌ లో ఏర్పాటు చేసిన తొట్టెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు

. గోల్కొండలోని అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించడానికి లంగర్ హౌజ్ నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ బయలుదేరారు. చోటాబజార్‌లోని పూజారి అనంతచారి ఇంటికి తొట్టెల ఊరేగింపు చేరనుంది.

పూజారి ఇంట్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. తొట్టెల ఊరేగింపు లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ వరకు కొనసాగనుంది. లంగర్ హౌజ్, చెరువుకట్ట, ఫతేదర్వాజా, చోటాబజార్‌ల మీదుగా ఊరేగింపు కోటపైకి చేరుకోనుంది. గోల్కొండ ఆలయానికి వెళ్లే మెట్లను పసుపు, కుంకుమలతో భక్తులు ఇప్పటికే అలంకరించారు. గోల్కొండ కోట, ఆలయం వద్ద పోలీసుశాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది.


Posted in Uncategorized

Latest Updates