గోవాలో దారుణం : బ్రిటీష్ మహిళపై రేప్

గోవాలో ఓ ఫారినర్ పై అత్యాచారం జరిగింది. ఇండియా టూర్ కు వచ్చిన 42 ఏళ్ల బ్రిటీష్ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. గురువారం ఉదయం సౌత్ గోవా లోని కనకోనా రైల్వే స్టేషన్ లో దిగి… పలోలెమ్ బీచ్ దగ్గర్లో ఉన్న తన రూమ్ కు వెళ్తుండగా మహిళపై ఈ దారుణం జరిగింది. తనను కొందరు దారి మధ్యలో ఆపి.. అసభ్యంగా ప్రవర్తించి.. అత్యాచారం చేశారంటూ గోవా పోలీసులకు ఆమె కంప్లయింట్ ఇచ్చింది. తన దగ్గరున్న డబ్బులు, విలువైన వస్తువులను కూడా తీసుకున్నారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.

బాధితురాలు చెప్పిన వివరాలతో… అనుమానితుల లిస్ట్ ప్రిపేర్ చేశామని పోలీసులు చెప్పారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు పెట్టామన్నారు. దోపిడీ దొంగలా.. పాత నేరస్తులా అన్నది దర్యాప్తులో తేలుస్తామని… నిందితులను పట్టుకుంటామని చెప్పారు ఇన్ స్పెక్టర్ రాజేంద్రప్రభుదేశాయ్. బాధితురాలికి మెడికల్ టెస్టులు చేయించామన్నారు.

గోవాలో టూరిజానికి మార్చి చివరివరకు మంచి సీజన్. ఇక్కడి బీచ్ అందాలను ఆస్వాదించేందుకు ఈ టైమ్ లోనే ఫారినర్స్ ఎక్కువగా వస్తుంటారు. అలా.. రెగ్యులర్ విజిట్ లో గోవాకు వచ్చానని బ్రిటీష్ మహిళ పోలీసులకు చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates