గోవా క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులు ఔట్

మంత్రివర్గం నుంచి ఇద్దరు మంత్రులు…. ఫ్రాన్సిస్‌ డిసౌజా, పాండురంగ్‌ మద్‌ కైకర్‌ లను తొలగించినట్లు గోవా సీఎం కార్యాలయం ఇవాళ(సెప్టెంబర్-24) ప్రకటించింది. వీరి స్ధానాల్లో బీజేపీ నాయకులు నీలేశ్‌ కార్బల్‌, మలింద్‌ నాయక్ ల ను మంత్రులుగా నియమించారు. ఫ్రాన్సిస్‌ డిసౌజా, పాండురంగ్‌ మద్‌ కైకర్‌ లు కొంతకాలంగా అనారోగ్యంతొ భాధపడుతున్నారు. ఫ్రాన్సిస్‌ ప్రస్తుతం అమెరికాలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. పాండురంగ్‌ ముంబైలోని ఓ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఈ కారణాలతోనే వీరిని మంత్రిపదవుల నుండి తొలగించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

మరోవైపు గోవాలో సీఎంను మార్చబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆదివారం ఫుల్ స్టాప్ పెట్టారు బీజేపీ చీఫ్ అమిత్ షా. సీఎంగా పారికర్ కొనసాగుతారని అమిత్ షా సృష్టం చేశారు. అయితే మంత్రివర్గ మార్పు ఉంటుందని తెలిపారు.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు గోవా సీఎం. అంతకుముందు ట్రీట్ మెంట్ కోసం రెండుసార్లు అమెరికా కూడా వెళ్లారు.

Posted in Uncategorized

Latest Updates