గోవా సర్కారు కీలక నిర్ణయం: పబ్లిక్ గా మందు తాగితే జరిమానా


గోవా ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.బహిరంగ ప్రదేశాల్లో  మందు కొడితే  జరిమానాలు విధిస్తామని గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ తెలిపారు. దానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెప్పారు. పబ్లిక్‌గా మందు తాగితే రూ.2,500 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఆగస్టు నుంచి బహిరంగంగా  మందు కొడితే భారీ జరిమానాలుంటాయన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. ఆగస్టులోపే ఈ విధానం అమలు చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని తెలిపారు సీఎం పారికర్‌.

గోవా రోడ్లపై ఖాళీ బీరు సీసాలు పడి ఉంటున్నాయని… ఇటీవల అభివృద్ధి చేసిన రివర్‌ ఫ్రంట్ ప్రాంతంలో కాలేజీ విద్యార్థులు బీర్లు తాగుతూ కనిపిస్తున్నారన్నారు సీఎం పారికర్‌. ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు బీరు బాటిళ్లు పట్టుకుని వెళ్తుండడం చూశానన్నారు. ఖాళీ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో మిగతా ప్రజలకు ప్రమాదమని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates