గోవా సీఎంగా పారికర్ కొనసాగుతారన్న అమిత్ షా

గోవా సీఎంగా పారికర్ ను తొలగించి మరొకరిని నియమించబోతున్నారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సీఎంగా మనోహర్ పారికర్ కొనసాగుతాడని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అమిత్ షా తెలిపారు. గోవా బీజేపీ కోర్‌ గ్రూప్‌ సభ్యులతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమిత్ షా తెలిపారు.
అనారోగ్య సమస్యల కారణంగా గోవా సీఎం మనోహర్ పారికర్ కొన్ని రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో గోవాలో అనిశ్చిత పరిస్ధితి నెలకొందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఐదు రోజుల క్రితం గోవా గవర్నర్ ని కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం కూడా సమర్పించారు.

Posted in Uncategorized

Latest Updates