గోవా సీఎం గా బాధ్యతలు చేపట్టిన పారికర్

parrikarదాదాపు మూడు నెలల తర్వాత గోవా సీఎం మనోహర్ పారికర్ విధుల్లో చేరారు. గురువారం(జూన్-14) అమెరికా నుంచి గోవా చేరుకున్న ఆయన శుక్రవారం (జూన్-15) సీఎం కార్యాలయానికి వెళ్ళి యథావిథిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పారికర్ తెలిపారు. నేను విధుల్లో చేరాను.. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. పారికర్ వైద్యం కోసం మూడు నెలల క్రితం అమెరికా వెళ్ళి అక్కడ చికిత్స తీసుకున్నారు. ఆయన గైర్హాజరీలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ పాలనా వ్యవహారాలు చూసుకుంది.

Posted in Uncategorized

Latest Updates