గౌరీ లంకేష్ హత్య: హిట్ లిస్ట్ లో నటుడు గిరీష్ కర్నాడ్

కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న ప్రత్యేక బృందం పోలీసులు (సిట్) ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు. సిట్ అధికారులు ఓ నిందితుడి దగ్గర ఉన్న డైరీని స్వాధీనం చేసుకున్నారు. డైరీలో మొత్తం 37 మంది పేర్లు హిట్ లిస్ట్ లో ఉన్నాయి. హిట్‌ లిస్ట్‌లోని పేర్లను చూసి షాక్‌ తిన్నారు సిట్ అధికారులు. డైరీలోని హిట్ లిస్ట్ లో గౌరీ లంకేష్ పేరు నెంబర్ 2 గా ఉందని… ప్రముఖ నటుడు, సాహితీవేత్త గిరీష్ కర్నాడ్ పేరు నెంబర్ 1 గా ఉందని సిట్ అధికారులు గుర్తించారు.

హిందూత్వ భావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఆరోపణలతో లంకేశ్‌ను గత ఏడాది సెప్టెంబర్‌ 5న తన ఇంటి సమీపంలోనే కిరాతకంగా హత్య చేశారు. రాడికల్‌ హిందూత్వ గ్రూప్‌ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది.

అదే ముఠాకి చెందిన కొం‍దరు సభ్యులు కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందుత్వ ధర్మనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మందిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 2016 నుంచి హిట్‌ లిస్ట్‌లో ఉన్న వారిపై హత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు డైరీలో వారు తెలిపారు. ఈ విషయాలను డైరీలో కోడ్‌ భాషలో రాసుకున్నటు సిట్‌ అధికారులు తెలిపారు. హిట్‌ లిస్ట్‌లో నంబర్‌ వన్‌గా ఉన్న గిరీష్‌ కర్నాడ్‌కు కర్ణాటక పోలీసులు గట్టి భద్రత కల్పించారు.

Posted in Uncategorized

Latest Updates