గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురి మృతి

హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలోని నెర్ చౌక్ లోని రెసిడెన్షియల్ బిల్డింగ్ లో గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు మృతి చెందారు. నిన్న(ఆదివారం-జూలై 22) రాత్రి నెర్ చౌక్ లోని రెసిడెన్షియల్ బిల్డింగ్ లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ఆ భవన సముదాయంలో పెద్ద మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకుని ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు. ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. మరికొందరు భవనంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు ఫైర్ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates