గ్రహణ గండాలకు అతీతం : కాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు

సాధారణంగా సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడితే చిన్న ఆలయాల నుంచి పెద్ద పెద్ద గుళ్లను కూడా మూసివేస్తారు. రాత్రికి చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటలకు ఆలయాల తలపులు మూసివేయనున్నారు. కానీ ఏపీ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచనున్నారు. దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా పేరున్న శ్రీకాళహస్తీలో ఎప్పుడు గ్రహణం పట్టినా…. ఆలయాన్ని తెరిచే ఉంచి ప్రత్యేక పూజలు చేయడం ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యేకంగా గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. రాత్రికి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ముక్కంటికి గ్రహణ కాల అభిషేకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటకు సంకల్ప పూజలు ప్రారంభించి ఉదయం 3 గంటల్లోపు అభిషేకాలు పూర్తి చేస్తామంటున్నారు పండితులు. ఈ సమయంలో భక్తులను కూడా అనుమతిస్తామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates