గ్రాండ్ విక్టరీ: ఫైనల్ కి హైదరాబాద్

matchIPL క్యాలిఫయర్ -2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించింది.  కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌క‌తా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ తో బరిలోకి దిగిన  హైద‌రాబాద్ 174 పరుగులు చేసింది. 175 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 9వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.

కోల్ కతా బ్యాట్స్ మెన్స్ లో క్రిస్ లిన్ 48,శుభమ్ గిల్-30, సునీల్ నారాయణ్ 26, నితీష్ రాణా 22 పరుగులు చేయగా… దినేష్ కార్తీక్ 8 పరుగులు చేశారు.

హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసుకోగా సిద్ధార్ద్ కౌల్,బ్రత్ వైట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

క్యాలిఫయర్ -2 మ్యాచ్ లో విజయం సాధించిన హైదరాబాద్ ఫైనల్ కు చేరింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నైతో తలపడనుంది హైదరాబాద్ .

Posted in Uncategorized

Latest Updates