గ్రాండ్ విక్టరీ : సూపర్ సెంచరీతో భారత్ ను గెలిపించిన కోహ్లీ

south-africa-india-finalసెంచూరియన్ వన్డేలో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఆఖరిదైన ఆరో మ్యాచ్ లోనూ… టీమిండియా చెలరేగిపోయింది. బౌలర్ల సూపర్ పెర్ ఫామెన్స్… కెప్టెన్ కోహ్లీ బ్రిలియంట్ సెంచరీ భారత్ కు అద్భుత విజయం కట్టబెట్టాయి. 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు చుక్కలు చూపించారు భారత బౌలర్లు. శార్దూల్ ఠాకూర్, బుమ్రా, చహల్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు పడగొట్టడంతో… 46.5ఓవర్లలో 204 పరుగులకు చాపచుట్టేసింది సౌతాఫ్రికా. ఏ ఒక్క సఫారీ బ్యాట్స్ మెన్ ని సెట్ కానివ్వలేదు భారత బౌలర్లు. మక్రమ్ 24, డివిల్లీర్స్ 30, క్లసెన్ 22, ఫెలుక్వాయో 34, మోర్కెల్ 20 పరుగులు చేశారు. సఫారీ ఇన్నింగ్స్ లో 54 పరుగులతో జోండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, బుమ్రా 2, యుజువేంద్ర చహల్ 2, పాండ్యా 1, కుల్దీప్ యాద్ ఒక వికెట్ పడగొట్టారు.
205 రన్స్ టార్గెట్ చేజింగ్ లో భారత్ కు స్టార్టింగ్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. 15 రన్స్ చేసిన రోహిత్ ను నగిడి ఔట్ చేశాడు. మరో ఓపెనర్ ధవన్ క్రీజులో ఇబ్బందిగా కనిపించాడు. చివరికి 18 పరుగుల దగ్గర పెవిలియన్ చేరాడు ధవన్. అయితే కెప్టెన్ కోహ్లీ… రహానేతో కలసి… భారత్ ను విజయం దిశగా నడిపించాడు. దూకుడుగా ఆడిన కోహ్లీ… సెంచరీ కొట్టాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 35వ సెంచరీ. ఓవరాల్ గా.. 2 సిక్సర్లు, 19ఫోర్లతో 129 పరుగులతో నౌటౌట్ గా నిలిచాడు. రహానే 34రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో 32.1ఓవర్లోనే టార్గెట్ చేజ్ చేసింది టీమిండియా.
ఈ మ్యాచ్ లో గెలుపుతో 6 వన్డేల సిరీస్ ను 5-1 తేడాతో గెలుచుకుంది టీమిండియా. సూపర్ సెంచరీతో భారత్ ను గెలిపించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు.

Posted in Uncategorized

Latest Updates