గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు ఇలా..

త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటర్లు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాదు ముందుగా వారు తమ ఓటును నమోదు చేసుకోవాలి. ఎలా ఓటర్లుగా తమ ఓటును నమోదు చేసుకోవాలనే దానికి సంబంధించి నియమ నిబంధనలను విడుదల చేసింది ఎన్నికల సంఘం.

2018 నవంబర్ 1వ తేదీకి మూడు సంవత్సరాల ముందు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపింది. అంతేకాదు 2015 నవంబర్ 1 నాటికి డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో డిగ్రీ పొంది ఉండాలి. దీంతో పాటు కనీసం మూడేళ్లు నియోజక వర్గ పరిధిలో నివాసం ఉండాలని తెలిపింది. గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు అయ్యే వారు ఫారం-18ని పూర్తి చేసి స్థానిక తహశీల్దారు/MPDP కార్యాలయాల్లో అందచేయాలని సూచించింది.గతంలో ఓటరుగా నమోదు అయిన వారు  మళ్లీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలని స్పష్టం చేసింది. ఫారం-18తోపాటు డిగ్రీ సర్టిఫికెట్ జత చేయాలంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు అయిన వారు సంబంధిత డిపార్ట్ మెంట్ అధికారి ధృవీకరణతో పంపించాలంది. సాధారణ ఓటర్ల జాబితాకు, పట్టభద్రుల ఓటర్ల జాబితాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది ఎన్నికల సంఘం.

Posted in Uncategorized

Latest Updates