గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి: కేసీఆర్

హైదరాబాద్: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని.. అందుచేత గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో ఇవాళ(ఆదివారం) కేసీఆర్ పంచాయతీరాజ్ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు.

మరోవైపు 9355 మంది కొత్త గ్రామ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై సీఎం సంతకం చేశారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని  అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కొత్త గ్రామ కార్యదర్శుల నియామకంతో రాష్ట్రంలోని గ్రామాలన్నింటికీ అధికారులు ఉంటారని, వీరి ద్వారా గ్రామాభివృద్ధి, పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates