గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కృషి : కడియం

kadiyamప్రజల సమస్యలపై అవగాహన లేని వారు… వాటి పరిష్కారం అన్వేషించలేని వారు ప్రజానిధులుగా ఉన్నా ఉపయోగం లేదన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఆదివారం (జూన్-10) వరంగల్ హన్మకొండలో ఎంపీ బండా ప్రకాశ్ కు ముదిరాజ్ సభ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మయ సన్మాన సభలో మాట్లాడారు కడియం.

కులవృత్తులు అభివృద్ధి చేసి…. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కడియం. జనం సమస్యలు పరిష్కరించేందుకు బండా ప్రకాశ్ ఎంతో శ్రమిస్తారని చెప్పారు నేతలు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్ భాస్కర్ హాజరయ్యారు

Posted in Uncategorized

Latest Updates