గ్రామీణ క్రికెటర్లకు కాకా టోర్నమెంట్ మంచి అవకాశం : హరీశ్

TTLజి.వెంకటస్వామి  మెమోరియల్  తెలంగాణ  టీ20 లీగ్.. రౌండ్-2  మ్యాచ్ లను మంత్రి హరీష్ రావు, హెచ్ సీఏ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సిద్ధిపేట మినీస్టేడియంలో మెదక్ మెవరిక్స్, ఖమ్మం తిరా జట్ల  మధ్య.. ఫస్ట్ మ్యాచ్  ను మంత్రి హరీష్ రావు శుక్రవారం (ఫిబ్రవరి-9) టాస్ వేసి ప్రారంభించారు. ఖమ్మం తిరా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్  సభ్యులు, ఫ్రాంచైజీల ఓనర్లు రౌండ్ 2 స్టార్టింగ్ మ్యాచ్ కు హాజరయ్యారు.

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు కాకా టీటీఎల్ తో మంచి అవకాశం దక్కిందన్నారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ స్టేడియం కోసం వెంకటస్వామి చాలా కృషి చేశారని.. ఆయన పేరుపై టోర్నీ నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. టోర్నీ మ్యాచ్ లకు సిద్ధిపేట వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సిద్ధిపేట మినీస్టేడియాన్ని డై అండ్ నైట్ మ్యాచ్ లకు అనుగుణంగా మారుస్తామన్నారు. సిద్ధిపేటతో పాటు.. త్వరలోనే అన్ని పట్టణాల్లో HCA టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు వివేక్ వెంకటస్వామి.

Posted in Uncategorized

Latest Updates