గ్రామీణ వ్యవస్ధ బాగుంటేనే రాష్ట్ర అభివృద్ది : ఎంపీ కవిత

kavithaగ్రామీణ వ్యవస్థ బాగుంటేనే రాష్ట్ర్రం అభివృద్ధి చెందుతుందన్నారు ఎంపీ కవిత. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ కవితకు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. మెటుపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి ఎంపీ కవిత పాల్గొన్నారు. బండలింగపూర్ గ్రామంలో సీసీ రోడ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆర్&బి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 36 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఆ తర్వాత మెట్ల చిట్టాపూర్ లో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఎంపీ కవిత.

Posted in Uncategorized

Latest Updates