గ్రీన్ కార్డు కావాలా : ఇప్పుడు అప్లయ్ చేస్తే.. 150 ఏళ్ల తర్వాతే..

green-cardఅమెరికా.. అమెరికా.. అమెరికా.. ఒక్కసారి అయినా ఆ దేశం వెళ్లాలి అనేది చాలా మంది కోరిక. వెళ్లినోళ్లకు మాత్రం అక్కడ ఉండపోవాలి అనేది లక్ష్యం. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. వెళ్లినోళ్లు తిరిగి రావటం లేదు. అక్కడే ఉండిపోవాలని.. శాశ్వత గుర్తింపు సాధించాలనేది వారి లక్ష్యంగా మారిపోయింది. అయితే సామాన్యులకు ఇది అంత సులువు కాదు అంటున్నాయి అమెరికా లెక్కలు. 2017 జారీ అయిన గ్రీన్ కార్డు లెక్కలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇప్పుడు అప్లయ్ చేసుకునే వారికి చచ్చిన తర్వాతే గ్రీన్ కార్డు వస్తోంది. అవును.. కనీం 150 ఏళ్లు సమయం పడుతుంది అంట. 2018 ఏప్రిల్ 20వ తేదీ నాటికి అక్షరాల 6లక్షల 32వేల 219 మంది ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ వారి భార్యలు, పిల్లలు గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 2017 జారీ అయిన లెక్కల ప్రకారం ఇన్ని సంవత్సరాలు పడుతుంది. కొందరికి మాత్రం మూడు, నాలుగేళ్లలోనే గ్రీన్ కార్డ్ వస్తోంది.

అవును.. అతి త్వరగా అమెరికా గ్రీన్ కార్డు కావాలంటే వారు అత్యంత నైపుణ్యం ఉన్న వారిగా గుర్తింపు తెచ్చుకోవాలి. హై క్వాలిఫికేషన్ అయ్యి ఉంటే.. కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లోనే అర్హత సాధించొచ్చు. వీరిని ఈబీ-1 కేటగిరీ కింద పరిగణిస్తారు. ఈబీ-1 కేటగిరి అంటే ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్. దీని కింద గుర్తింపు ఉంటే ఆరేళ్లలోనే గ్రీన్ కార్డు వస్తుంది. ఈ కేటగిరీ కింద ప్రస్తుతం 34వేల 824 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి క్లియరెన్స్ కు ఆరేళ్ల వరకు సమయం పట్టొచ్చు. ఇక మరో కేటగిరీ ఈబీ-3. ఈ నిబంధనల కింద ఉన్నవారు గ్రీన్ కార్డు కావాలంటే కనీసం 15 సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకంటే.. ఇప్పటికే 54వేల 892 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 2017 గ్రీన్ కార్డు జారీల సంఖ్యను ఆధారంగా నిర్ణయించి.. ఈ సమయాన్ని లెక్కించారు. గ్రీన్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత శాశ్వత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అర్హత వస్తోంది. ఈ లెక్కలు అన్నీ కూడా భారతీయులకు సంబంధించినవి మాత్రమే. ఆయా సందర్భాలు, అమెరికా డిమాండ్ ఆధారంగా గ్రీన్ కార్డు జారీలో వేగం ఉండొచ్చు కూడా…

Posted in Uncategorized

Latest Updates