గ్రీన్  చాలెంజ్ : మొక్కలు నాటిన ఎర్రోళ్ల శ్రీనివాస్

గ్రీన్  చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ మారేడుపల్లిలో మూడు మొక్కలు నాటారు రాష్ట్ర SC, ST కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. తర్వాత మంత్రి తలసాని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, సినీ నటులు కృష్ణ, రవితేజ, SC, ST కమిషన్ సభ్యులు రామ్ బాల్ నాయక్ కు గ్రీన్ చాలెంజ్ విసిరారు ఎర్రోళ్ల. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చాలెంజ్ విసిరిన వారితో పాటు ఎర్రోళ్ల మిత్రమండలి సభ్యులు తమ బాధ్యతగా 3 మొక్కలు నాటాలని కోరారు ఎర్రోళ్ల శ్రీనివాస్

Posted in Uncategorized

Latest Updates