గ్రీన్ ఛాలెంజ్ : ఇంటి పెరట్లో మొక్కలు నాటిన మెగాస్టార్

రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేయ‌డ‌మే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మేము సైతం అంటూ సినీ ప్ర‌ముఖులు ముందుకొస్తున్నారు. హ‌రిత‌హారంలో భాగంగా చేప‌ట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ ని స్వీక‌రించారు మెగాస్టార్ చిరంజీవి. త‌న ఇంటి పెర‌ట్లో మొక్క‌లు నాటి హ‌రిత‌హారం ఉద్య‌మానికి నేను సైతం అంటూ.. మొక్క‌లను నాటి, వాటికి నీళ్లు పోస్తున్న ఫోటోల్ని తన అభిమానుల‌తో  పంచుకున్నారు. మంచి కోసం మేము సైతం అంటూ మెగా అభిమానులు ముందుకు రావాల‌ని మెగాస్టార్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియో సందేశం కూడా ఇచ్చారు.

హరితహారం ఛాలెంజ్ ని స్వీకరించి నేను మా ఇంటి పెర‌ట్లో మూడు మొక్క‌లు నాటాను. ఈ సందర్భంగా నేను మరో ముగ్గురు ప్రముఖులు అమితాబ్ బచ్చన్, రామోజీరావు, పవన్ కళ్యాణ్ లను గ్రీన్ ఛాలెంజ్ కి నామినేట్ చేస్తున్నాను. వీరు ముగ్గురు నా చాలెంజ్ ను అంగీకరించి ఓ మంచి కార్యక్రమానికి స్వీకారం చుడతారని భావిస్తున్నానని ఆ వీడియోలో మెగాస్టార్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates