గ్రీన్ ఛాలెంజ్ పూర్తి చేసిన స‌చిన్‌, ల‌క్ష్మ‌ణ్‌

తెలంగాణ మంత్రి కేటీఆర్ హరిత సవాల్‌ను క్రికెటర్లు సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ స్వీకరించారు. హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్‌కు తనను నామినేషన్ చేసినందుకుగాను సచిన్ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను మొక్కలు నాటినట్లుగానే అందరూ గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని సచిన్ కోరారు. భూమిపై పచ్చదనం పెంపొందించడం మన చేతుల్లోనే ఉందన్నారు. వీవీఎస్ లక్ష్మణ్ తన గార్డెన్‌లో మొక్కలు నాటారు. తర్వాత ఆయన సెహ్వాగ్, మిథాలీరాజ్, పీవీ సింధులకు హరిత సవాల్ విసిరారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలని కోరారు.

సిని దర్శకుడు రాజమౌళి ‘హరితహారం’ సవాల్ ను స్వీకరించిన మంత్రి కేటీఆర్… రోజ్ ఉడ్, గోల్డెన్ చంపా మొక్కలను నాటి, మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, రాజ్ దీప్ సర్ దేశాయ్ లకు సవాల్ విసిరారు. ఒక్కొక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates