గ్రీన్ ఛాలెంజ్ : మొక్కలు నాటిన బ్రహ్మానందం

హరితహారంలో భాగంగా మొదలై గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా దూసుకెళ్తోంది. ఇప్పటికే కవిత, కేటీఆర్, రాజమౌళి, సచిన్, లక్ష్మన్ ఈ చాలెంజ్ స్వీకరిస్తూ మొక్కలు నాటగా..ఆదివారం (జూలై-29) బ్రహ్మనందం మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి శుక్రవారం (జూలై-27) స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మొక్కలు నాటి తెలుగు సినీ దర్శకులు వివి వినాయక్, సీనినటులు బ్రహ్మనందం, పోలీస్ కమిషనర్ కార్తీకేయకు సవాల్ చేసిన విషయం తెలిసిందే. జీవన్‌ రెడ్డి విసిరిన సవాల్‌ ను ఆదివారం బ్రహ్మానందం స్వీకరించారు. తన నివాసంలో మొక్కలు నాటి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో తనను భాగస్వామ్యం చేసిన జీవన్‌ రెడ్డికి బ్రహ్మానందం కృతజ్ఞతలు తెలిపారు. తాను చేసిన గ్రీన్ ఛాలెంజ్‌ ను స్వీకరించి మొక్కలు నాటిన బ్రహ్మానందంకు జీవన్‌ రెడ్డి ట్విటర్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాల్ విసరాలి. ఆ ముగ్గురు మూడు మొక్కల చొప్పుననాటి మిగతావారికి సవాల్ విసరాలిఅనే ఉద్దేశంతో జూలై 17న హైదరాబాద్‌ లో మొదలైన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది.

Posted in Uncategorized

Latest Updates