గ్రీస్ కార్చిచ్చు : 100కి చేరిన మృతుల సంఖ్య

గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ సమీపంలోని రిసార్ట్‌ టౌన్‌ మాటీలో సోమవారం (జూలై-23)  భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కార్చిచ్చుతో స్పాట్ లోనే 50 మంది చనిపోగా..బుధవారం (జూలై-25) నాటికి మృతుల సంఖ్య 100కి చేరింది. కార్చిచ్చుతో ఏథెన్స్ సమీపంలోని రిసార్ట్ మాటీలో నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కొన్ని గంటలపాటు పదుల సంఖ్యలో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఫైర్‌ సిబ్బంది యత్నించి మంటల్ని అదుపులోకి తెచ్చినా.. అప్పటికే జరగాల్సిన జరిగిపోయింది.

100 మంది మృతిచెందగా, మరో  వెయ్యి మందికి కాలిన గాయాలైనట్లు సమాచారం. చనిపోయిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. మంటల్ని అదుపులోకి తెచ్చినా.. పదే పదే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని వెల్లడించారు గ్రీస్‌ అధికారులు. మంటలనుంచి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు బీచ్‌ ల వైపు పరుగులు తీయగా, కార్చిచ్చు వందల ఇళ్లు, కార్లు, ఇతర వాహనాలను బుగ్గి చేసింది. మాటీ గ్రామంలో 26 మంది అక్కడికక్కడే మంటల్లో ఆహుతైనట్లు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. రెడ్‌ క్రాస్‌ కు చెందిన ఓ అధికారి మంగళవారం (జూలై-24) ఘటనకు సంబంధించి పలు విషయాలు తెలిపారు. వేడి కారణంగా అడవుల్లో ఏర్పడ్డ కార్చిచ్చు పట్టణాన్ని మొత్తం ఆహుతి చేసిందన్నారు. ఏథెన్స్‌ పరిధిలో జరిగిన ఈ దావానలం దేశాన్నే సంక్షోభంలో పడేసింది.

Posted in Uncategorized

Latest Updates