గ్రౌండ్ లో ఆడటం మర్చిపోయారు :స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్స్ తో పిల్లలు బిజీ

schl
మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్ తో బిజీ అయిన పిల్లలు గ్రౌండ్ లో ఆడటమే మర్చిపోయారు.  ఇంటి పట్టున ఉండి ఆడుకునే ఆటల్ని కూడా పట్టించుకోవడం లేదు.  అయితే పిల్లలకు శారీరక శ్రమ లేకపోతే  ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

ఒకప్పుడు  ఆటలంటే స్నేహితులతో కలిసి ఆడుకునేవారు. కోతికొమ్మచ్చి, పచ్చీస్, వైకుంఠపాళీ, తొక్కుడు బిళ్ళ, కర్రా బిళ్ళ, అష్టాచెమ్మ, కచ్చా కాయలు, దాగుడు మూతలు, బొంగరం ఇవన్నీ ఆరు బయట ఆడుకునేవారు. కానీ ఇప్పటి పిల్లలకి వీటి పేర్లు కూడా సరిగా తెలియవు. మొబైల్, వీడియో గేమ్స్ తప్ప… ఇతర ఏ ఆటలు తెలియకుండా పోతోంది.

పిల్లలకి ఇండోర్ గేమ్స్ తో ఔట్ డోర్ గేమ్స్ ఆడిస్తే… శారీరకంగా, మానసికంగా మంచిదంటున్నారు సైకాలజిస్టులు. గతంలో ఆడిన ఆటలన్నీ టైంపాస్ కోసం మాత్రమే కాదనీ… సైంటిఫిక్ వే లో డిజైన్ చేయడం జరిగిందంటున్నారు. ఆరు బయట ఆడుకునే  ఆటలతో చురుకుదనం పెరగడంతో పాటు గెలుపు ఓటములపై అవగాహన వస్తుందంటున్నారు.

తల్లిదండ్రులు కూడా అప్పటి ఆటలపై అవగాహన ఉన్నా.. ట్రెండీ ప్రపంచంలో పడి తమ పిల్లలని మోడ్రనైజ్ గా చూడాలని కొందరు అనుకుంటున్నారు. బిజీ లైఫ్ లో పిల్లల్ని పట్టించుకోనివారు ఇంకొందరు ఉన్నారు. పిల్లలు మారాం చేసినా, తిండి తినకపోయినా.. పిల్లల్ని కలర్ ఫుల్ గేమ్స్ చూపించి ఆకట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. సెలవుల్లో స్పెషల్ కోచింగ్ లకు పంపుతున్నారు.

స్మార్ట్ ఫోన్లల్లో ఉండే గేమ్స్ పైనే ఎక్కువగా పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క ఫోన్ లో చాలా రకాల గేమ్స్ ఉండటంతో యాప్స్ వేసుకొని మరీ ఆడుతున్నారు. ఎప్పుడూ కాకపోయినా అపుడప్పుడైనా పిల్లలకి పల్లెల్లో ఆడే ఆటలని పేరెంట్స్ నేర్పించాలంటున్నారు నిపుణులు.

 

Posted in Uncategorized

Latest Updates