గ్లోబల్ హాస్పిటల్ పై దాడి కేసు : నిందితులు అరెస్ట్

హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ పై దాడి కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితులు మోహీనుద్దీన్, భర్కత్, సుజత్, మోహిన్ ఖాన్లుగా గుర్తించారు. షబానా బేగం అనే మహిళ డిసెంబర్- 18న ఛాతి నొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయింది. ట్రీట్ మెంట్ తీసుకుంటూ డిసెంబర్-24న చనిపోయింది.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని హాస్పిటల్ ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు కుటుంబ సభ్యులు. కేసు  దర్యాప్తు చేసిన పోలీసులు దాడిచేసిన నలుగుర్ని అరెస్టు చేశారు.

Posted in Uncategorized

Latest Updates