ఘనంగా ఆవిర్భావ వేడుకలు : సింగరేణిది 130 ఏళ్ల చరిత్ర

రాష్ట్రంలో సింగరేణి సంస్థ 130వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గనులపై సింగరేణి జెండా ఎగురవేసి సెలబ్రేషన్స్ జరుపుకొన్నారు కార్మికులు. రానున్న రోజుల్లో ప్రమాద రహిత సంస్థగా సింగరేణిని తయారు చేస్తామన్నారు అధికారులు. ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని సింగరేణి ఏరియాల్లో  వేడుకలు నిర్వహించారు. సంస్థ పతాకాన్ని ఎగురవేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్. సింగరేణి ఆఫీస్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు జరిగిన టూకే రన్ లో చాలా మంది కార్మికులు  పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రామగుండం ఏరియా గోదావరిఖనిలో బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన పరికరాల నమూనాలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని జీఎం విజయపాల్ రెడ్డి ప్రారంభించారు.. అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో గనులపై జెండా ఎగురవేశారు అధికారులు. అటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన సెలబ్రేషన్స్ లో స్టాల్స్ ఆకట్టుకున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates