ఘనంగా ప్రారంభమైన దసరా వేడుకలు

దసరా వేడుకలు  దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైయయ్యాయి. చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి భక్తులు నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు.  రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన వేములవాడ, బాసర, జోగులాంబ, వరంగల్, భద్రాచలం, జూబ్లిహిల్స్ పెద్దమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఉదయం నుంచే అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు.. కోల్‌కతాలోని దుర్గామాత ఆలయాలకు భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చి, అమ్మవారి దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని వైష్ణవిదేవి ఆలయాన్ని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates