ఘనంగా భక్త మార్కండేయ జయంతి

సిరిసిల్ల : భక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలను పట్టణ పద్మశాలీ, అనుబంద సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కండేయ స్వామి జయంతి వేడుకలకు ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. వస్త్ర పరిశ్రమకు కేంద్ర బింధువైన సిరిసిల్ల జయంతి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

శుక్రవారం ఉదయం ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలను ప్రారంభించిన పద్మ పురోహితులు వేదమంత్రాల మధ్య యజ్ఞం నిర్వహించారు. అనంతరం శ్రీ శివభక్త మార్కండేయుడి ఉత్సవ విగ్రహాలను రథంపై పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. స్థానిక పాత బస్టాండ్‌లోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి, ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన నిర్వహించారు.

 

Latest Updates