ఘనంగా హరీష్ బర్త్ డే వేడుకలు

HARISHతెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం (జూన్-3) మంత్రి హరీష్ పుట్టిన రోజు సందర్భంగా మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని ఆయన నివాసం దగ్గర అభిమానుల కోలాహలం నెలకొంది. అలాగే మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు.

ఈ సందర్భంగా అభిమానులు తెచ్చిన భారీ కేక్ ను మంత్రి హరీష్ కట్ చేశారు. మంత్రి హరీశ్ రావు పుట్టిన రోజు సందర్భంగా ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అభిమానులు. సముద్రం పక్కన తెలంగాణ పటం, మిషన్ కాకతీయ, మన ఊరు మన చెరువు పేరుతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం హరీశ్ ఎంతో కష్టపడుతున్నారన్నారు అభిమానులు.

Posted in Uncategorized

Latest Updates