ఘోర ప్రమాదం : ఇళ్లలోకి దూసుకొచ్చి పేలిపోయిన పెట్రోల్ ట్యాంకర్

OILకర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరులో జిల్లాలోని కడూర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్ ట్యాంకర్  అదుపుతప్పి ఇళ్లలోకి దూసుకొచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ట్యాంకర్ పేలిపోయింది. పెట్రోల్.. అందులోనూ మంటలు.. చుట్టుపక్కల ఐదు ఇల్లు కాలి బూడిద అయ్యాయి. వేగంగా వచ్చిన ట్యాంకర్ అదుపుతప్పి పల్టీలు కొట్టుకుంటూ రావటం వల్లే మంటలు అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి ఎగసిపడిన మంటలు చుట్టు పక్కల ఉన్న ఇళ్లను కాలి బూడిద చేశాయి. ప్రమాదం సమయంలో ఇళ్లలోని వారు ఎవరూ గాయపడలేదు.

మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నాలుగు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. మంటల ధాటికి ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా కాలిపోయింది. అతి పెద్ద ఘోర ప్రమాదం జరిగిందని.. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
PF

Posted in Uncategorized

Latest Updates